క్రికెటర్’తో తమన్నాకు లింకు

మిల్కీ బ్యూటీ తమన్నాది క్లీన్ ఇమేజ్. ఆమెపై వచ్చిన గాసిప్ చాలా తక్కువ. వచ్చినా అవి పెద్దగా నిలబడలేదు. తాజాగా పాక్ క్రికెటర్ తో తమన్నాకి లింక్ పెడుతూ ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో ఉన్నది మాజీ పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్. అయితే ఈ రూమ‌ర్ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందీ  తమ్మూ.

“ఒక‌రోజు  న‌టుడి పేరు చెప్తారు. మ‌రో రోజు క్రికెట‌ర్ అంటారు, ఇటు డాక్ట‌ర్ అంటారు, అటు క్రికెట‌ర్ అంటారు. ఇలా అంద‌రితో రిలేష‌న్‌షిప్ అంట‌గ‌ట్ట‌డం ఏంటని క‌డిగి పారేసింది. త‌ను ఎవ‌రితోనూ డేటింగ్‌లో లేన‌ని క్లారిటీ ఇచ్చేసింది” తమ్మూ. మరీ.. ఆ ఫొటో ఎలా వచ్చింది అంటే.. ? గ‌తంలో దుబాయ్‌లో ఓ న‌గ‌ల షాపు ప్రారంభోత్స‌వానికి త‌మ‌న్నాతో పాటు, అబ్దుల్ కూడా వెళ్లాడు. ఆ సందర్భంలో తీసిందీ.. ఫోటోని క్లారిటీ ఇచ్చింది.