ఒక్కసారిగా పెరిగిన విజయ్ ఫాలోవర్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరో.. అంతకుమించి ఎదిగిన సంగతి తెలిసిందే. విజయ్ ఏం చేసిన ఓ డేర్ కనిపిస్తుంటుంది. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలని ఆదుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం నిజంగా గొప్పది. అదే విధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకి శిక్షణ ఇప్పించి.. వారికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేయడం.. వారు జీవితంలో సెట్ అయితే విజయ్ ఆనందంగా ఫీలవ్వడం అభినందించాల్సిన విషయం.

అయితే ఇలాంటి మంచి పనులు చేస్తున్న విజయ్ పైన మూడ్నాలుగు వెబ్ సైట్స్ తప్పుడు వార్తలు రాయడంతో.. ఆయనకి కాలింది. #KillFakeNews అంటూ వారిని ఏకీ పారేశాడు విజయ్. విజయ్ కి టాలీవుడ్ మొత్తం అండగా నిలబడింది. మెగాస్టార్ చిరంజీవి, మహేష్, నాగ్, కొరటాల శివ, రవితేజ.. ఇలా ప్రతి ఒక్కరు విజయ్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది.

దక్షిణాదిన ఎక్కువమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ అవతరించాడు. మరే హీరోకి లేనంతగా విజయ్ కు 70 లక్షలకు పైగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ చేరారు. ఇంతజేసీ విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించింది రెండేళ్ల కిందటే. అయినప్పటికీ ఇతర హీరోలకు సాధ్యం కాని రీతిలో అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.