స్టార్ హీరోల సినిమాలకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్

సినీ పరిశ్రమని కరోనా కోలుకోలేని దెబ్బ తీసినట్టు కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలకి సైతం అడ్వాన్స్ రాని పరిస్థితి. మహేష్ బాబు, అల్లు అర్జున్ ల సినిమాలకి కూడా అడ్వాన్సులు రావడం లేదు. ఫైనాన్స్ ఇవ్వడానికి ముందు రావడం లేదు. స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మీడియం రేంజ్ సినిమాలు, చిన్ని సినిమాల పరిస్తితి ఎలా ఉంటుంది ? అన్నది అర్థం చేసుకోవచ్చు.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకి అడ్వాన్సులు రావడం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారు.. కరోనా కాస్ట్ కటింగ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి.. కరోనా ఎఫెక్ట్ తో సినీ పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు తప్పేలాలేవ్.
