బ్రేకింగ్ : తెలంగాణలో మే29 వరకు లాక్ డౌన్ పొడగింపు

కరోనా కట్టడి విషయంలో కేంద్రాన్ని మించి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దేశంలో మూడో విడత లాక్ డౌన్ ని కేంద్రం మే 17 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం మూడో విడత లాక్ డౌన్ మే 29 వరకు కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా భేటీ జరిగింది. కేబినేట్ తీసుకున్న విశేషాలని సీఎం కేసీఆర్ మీడియాకి వివరిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడి విషయంలో మనం ఆఖరి స్టేజ్ లో ఉన్నాం. మరికొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే.. బయటపడొచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే మే 29 వరకు లాక్ డౌన్ ని పొడగిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
