మే15 తర్వాత తెలంగాణలో సడలింపులు

మూడో విడత లాక్ డౌన్ భాగంగా కేంద్రం భారీగానే సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరేంజ్, గ్రీన్ జోన్లలో మద్యం షాపులకి అనుమతులు ఇచ్చింది. రెడ్ జోన్లలోనూ కొన్ని సడలింపులిచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు.
ఆరేంజ్, గ్రీన్ జోన్లలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్నీ రకాల దుకాణాలకి అనుమతిని ఇచ్చారు. మున్సిపాలిటీల్లో మాత్రం అనుమతిని ఇవ్వలేదు. అక్కడ సామాజిక దూరం నిబంధన పాటించడం కష్టమన్నారు.
మద్యం షాపులకి అనుమతులు ఇచ్చే విషయంపై ఈ నెల 15 తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆలోపు దేశంలో స్టేటస్ ఏంటన్నది తెలుస్తోందన్నారు. ఇక రేపటి నుంచే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రయివేటు ఆఫీసుల్లో 30శాతం సిబ్బందితో నడపవచ్చన్నారు.
