పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం

తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా భేటీ జరిగింది. కేబినేట్ తీసుకున్న విశేషాలని సీఎం కేసీఆర్ మీడియాకి వివరిస్తున్నారు.
పదో తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైకోర్టు విధించిన నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలని పాటిస్తూ.. పరీక్షలు నిర్వహిస్తాం. ఒక్కో తరగతి గదికి 20 మంది చొప్పున కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహిస్తాం. ఇంటర్మిడియేట్ పేపర్ వాల్యూయేషన్స్ ని నిర్వహిస్తాం. త్వరలోనే ఫలితాలు ప్రకటిస్తామని సీఎం కేసీఆర్.
