బ్రేకింగ్ : తెలంగాణలో మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఆరేంజ్, గ్రీన్ జోన్లతో పాటు రెడ్ జోన్లలోనూమద్యం అమ్మకాలకి అనుమతులు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. రేపటి నుంచే మద్యం షాపులు తెరచుకోనున్నాయి. అయితే మద్యం అమ్మకాలపై యావరేజ్ గా 16శాతం పెంచినట్టు తెలిపారు.

చీప్ లీకర్ పై తక్కువ.. పెద్ద బ్రాండ్లపై ఎక్కువగా.. యావరేజ్ గా 16శాతం మద్యం రేట్లు పెంచినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే పెంచిన మద్యం ధరలని మళ్లీ తగ్గించమని తెలిపారు. బార్లు, పబ్ లు, క్లబ్ లకి మాత్రం నో చెప్పారు సీఎం కేసీఆర్. ఇక మద్యం షాపుల దగ్గర సామాజిక దూరం పాటించాలి. లేదంటే గంటలోనే షాపుల లైసెన్స్ ని రద్దు చేస్తామని తెలిపారు.