తారక్’ని సపోర్ట్ చేసిన పూనమ్

హీరోయిన్ మీరా చోప్రాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల ట్విట్టర్ వార్ జాతీయ సమస్యగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్స్ స్పందించింది. జాతీయ చానెల్స్ తారక్ ఫ్యాన్స్ రచ్చపై కథనాలు ప్రసారం చేశాయి. వీటిలో తారక్ ఫోటోలు, వీడియోలు ప్రదర్శించారు.

ఈ వ్యవహారాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లింది మీరా చోప్రా. ఆమె ట్విట్ కి స్పందించిన మీరా.. బాధితులపై చర్యలు తీసుకోవాలి డీజీపీ, సీపీలని ఆదేశించారు. చాలా మంది తారక్ ఫ్యాన్స్ చేసింది తప్పు అని చెబుతున్నారు. మరోవైపు ఇంత రచ్చ జరుగుతున్న ఇప్పటి వరకు తారక్ స్పందించకపోవడంపై విమర్శలొస్తున్నాయ్. అయితే కొంతమంది సినీ తారలు ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్ ఖుష్భూ తారక్ ని సపోర్ట్ చేసింది. ఆయన గుడ్ బాయ్ అని కితాబిచ్చింది.

తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా తారక్ ని సపోర్ట్ చేస్తూ ట్విట్ చేసింది. ‘ఏ నటుడు కూడా అభిమానులు ఇలాంటి పనులు చేయాలని కోరారు. వారిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇండస్ట్రీలో ట్రోలింగ్ భాగమే. వాటిని లైట్ తీసుకోవాల్సిందే’నని పూనమ్ ట్విట్ చేశారు. మరో ట్విట్ లో ‘ఇండస్ట్రీ అనేది ఓ పొలిటికల్ పార్టీతో లింకై ఉంది. అభిమానులు అమాయకులు. ఫేక్ అకౌంట్స్ పొలిటికల్ పార్టీ చేస్తున్న పని ఇది’అని ట్విట్ చేసింది.