బాలయ్య షష్టిపూర్తి వేడుక.. చిరుకి ఆహ్వానం !

నందమూరి అభిమానులకి పండగ వచ్చేసింది. ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు. 60వ పుట్టినరోజు. ఇది బాలయ్య షష్టిపూర్తి సంబరం కూడా. కరోనా ప్రభావం లేకుంటే.. బాలయ్య షష్టిపూర్తి వేడుక అంగరంగ వైభవంగా జరిగేది. టాలీవుడ్ మొత్తం తరలివచ్చేదే. అభిమానులకి ఆహ్వానం అందేది. అయినా.. షష్టిపూర్తి వేడుకని ఇంటి వేడుకగా జరుపుకోవాలని బాలయ్య ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖులని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని బాలయ్య ఆహ్వానించబోతున్నారట. ఇటీవల చిరు-బాలయ్యల మధ్య కాస్త దూరం పెరిగినట్టు కనిపించింది. షూటింగ్ లకి అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వంలో సినీ ప్రముఖుల భేటీకి తనని పిలవలేదని బాలయ్య అసంతృప్తిని వ్యక్తం చేయడం. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు హీటుని పెంచాయ్. బాలయ్య వర్సెస్ చిరు అనే సీన్ ని క్రియేట్ చేశాయి. అయితే తనకి చిరుతో ఎలాంటి విబేధాల్లేవ్. ఆయన తనకి మిత్రుడు అనే సంకేతాలని బాలయ్య ఇవ్వబోతున్నారు. తన షష్టిపూర్తి వేడుకకి చిరుని ఆహ్వానించబోతున్నారని తెలిసింది.