తారక్ ఫ్యాన్స్ ఇష్యూ.. వెనక జనసేన !

దేశంలో, రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి లింకు పెట్టడం, ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకుంది హీరోయిన్ పూనమ్ కౌర్. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇష్యూని పరోక్షంగా జనసేనుకు లింకుపెట్టి ట్విట్ చేసింది. తారక్ ఫ్యాన్స్, హీరోయిన్ మీరా చోప్రాల మధ్య ట్విట్టర్ వార్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇటీవల సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసిన మీరాచోప్రాని ఓ తారక్ అభిమాని పలకరించాడు. తారక్ గురించి చెప్పమని అడిగారు. ‘తనకి తారక్ గురించి తెలీదు. తాను మహేశ్ అభిమానిని’ అని మీరా తెలిపింది. దీంతో తారక్ ఫ్యాన్స్ మీరాని ట్రోల్ చేశారు. దానికి నొచ్చుకున్న మీరా చోప్రా సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులని గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. ప్రస్తుతం మీరా చోప్రా ఢిల్లీలో ఉంటున్నందున ఈ కేసుని అక్కడికి బదిలీ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై పూనమ్ ట్విట్టర్ వేదిగా స్పందించారు.

“అవి పొలిటికల్ పార్టీ క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్స్. ఇండస్ట్రీ ఓ పాలిటికల్ పార్టీలో లింకై ఉందన్న విషయం అంగీకరించాలి. అభిమానులు అమాయకులు. కొందరు రాజకీయ నేతలు చేయించిన పని ఇది. దీని వలన అభిమానులని బ్లేమ్ చేస్తారు’ అంటూ తారక్ ఇష్యూని జనసేనకి లింకుపెట్టే ప్రయత్నం చేసింది పూనమ్. అయితే ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ మంచి పనులు చేసేందుకు ప్రోత్సహిస్తుంటారు పవన్. అలాంటి పవన్ పై ప్రతి ఇష్యూని లింకుపెట్టడం వలన పూనమ్ కి మీడియా కవరేజ్ వస్తుందేమో. కానీ ఇంకేం రాదు.
