సుశాంత్ కేసు : విచారణలో భన్సాలీ చెప్పిన షాకింగ్ నిజాలు


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. డిప్రెషన్స్ తోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే సుశాంత్ ఆత్మహత్యకి కారణం బాలీవుడ్ లో బంధు ప్రీతినే కారణం. సుశాంత్ కి అవకాశాలు రాకుండా చేశారు. అందుకే ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆత్మహత్య చేసుకొన్నారనే విమర్శలొచ్చాయ్. సుశాంత్ ని తొక్కేశారంటూ కొందరు పేర్లు వెలుగులోకి వచ్చాయ్.

ఈ నేపథ్యంలోనే పలువురు బాలీవుడ్ పెద్దలను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని సోమవారం పోలీసులు విచారించారు. విచారణలో భన్సాలీ ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలిసింది. సుశాంత్‌ను తొలిసారి 2012లో చూశానని, సరస్వతి చంద్ర సినిమా కోసం క్యాస్టింగ్ బృందాన్ని ఎంపిక చేస్తున్న సమయంలో సుశాంత్ నటనా నైపుణ్యాన్ని పరీక్షించినట్లు భన్సాలీ తెలిపారు. సుశాంత్ యాక్టింగ్ స్కిల్స్ తనను ఇంప్రెస్ చేసినట్లు భన్సాలీ పోలీసులకు చెప్పారు.

సుశాంత్‌కు రెండుసార్లు ఆఫర్ ఇచ్చానని, కానీ తానెన్నడూ తన ప్రాజెక్టుల నుంచి సుశాంత్‌ను తీసివేయలేదని భన్సాలీ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. 2013లో రామ్‌లీలా గోలియోంకా రాస్‌లీలా సినిమాను భన్సాలీ తీశాడు. ఆ ఫిల్మ్ మేకింగ్ సమయంలో ఓ పాత్ర కోసం సుశాంత్‌ను అప్రోచ్ అయినట్లు భన్సాలీ వెల్లడించారు. ఆ తర్వాత మళ్లీ బాజీరావు మస్తానీ సినిమా కోసం కూడా సుశాంత్‌కు ఆఫర్ ఇచ్చినట్లు భన్సాలీ పోలీసులకు తెలిపారు. కానీ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో ఉన్న ఒప్పందం వల్ల సుశాంత్ తన సినిమాల్లో నటించలేకపోయినట్లు భన్సాలీ వెల్లడించారు.