దేశంలో 22,252 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గతవారం రోజులుగా ప్రతిరోజూ 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 22,252 కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరింది.
సోమవారం ఒక్కరోజే 467మంది మృత్యవాతపడ్డారు. దీంతో భారత్‌లో కొవిడ్ మృతుల సంఖ్య 20,160కు చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకోగా మరో 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణతో భారత్ ప్రపంచంలోనే మూడోస్థానంలో కొనసాగుతోంది.
