తెలంగాణ కరోనా రిపోర్ట్

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1879 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1422 కేసులు వచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612కి చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 313కి పెరిగింది.

మంగళవారం మరో 1506 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,012 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తెలంగాణలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బిల్లు మొత్తం చెల్లిస్తేనే డెడ్ బాడీలని అప్పగిస్తామని.. లేదంటే జీహెచ్ ఎంసీ కి అప్పగిస్తామని ప్రవైటు ఆసుపత్రులు బెదిరింపులకి పాల్పడుతున్నట్టు కంప్లైట్ వస్తున్నాయి.