ప్రభాస్, హృతిక్.. ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ !

కొద్దిరోజులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ ని ఓకే చేశారు. బాలీవుడ్ లో సినిమా ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీని గురించి పూర్తి సమాచారం వచ్చేసింది. ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌతు ప్రభాస్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడట. అయితే ఇది సింగిల్ హీరో సినిమా కాదు. మల్టీస్టారర్.
మరో హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తారని చెప్పుకొంటున్నారు. ఇదో యాక్షన్ ఎంటర్ టైనర్ ని అని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, హృతిక్ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని బాలీవుడ్ లో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాథే శ్యామ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఇదో సైన్స్ ఫిక్సన్ సినిమా. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, హృతిక్ చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. ఆయన ప్రభాస్ కోసం వెయిట్ చేసి.. ఆయన ఫ్రీ అయ్యాక.. ఓం రౌతు మల్టీస్టారర్ లో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సౌత్ స్టార్, బాలీవుడ్ స్టార్ కలిస్తే ప్రభంజనమేనని అభిమానులు చెప్పుకొంటున్నారు.
