తెలంగాణ కొత్త సచివాలయం ఎలా ఉండబోతుందంటే.. ?

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు మంగళవారం మొదలయ్యాయ్. త్వరలోనే కూల్చివేత పనులు పూర్తి చేసి.. శ్రావణంలో కొత్త సచివాలయ పనులని మొదలెట్టనున్నారు. యేడాదిలోగా సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త సచివాలయం నమూనాకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

మరోవైపు సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా టైమ్ లో కొత్త సచివాలయం అవసరమా ? అని ప్రశ్నిస్తున్నాయి. సెక్షన్ 8 అంటూ కొత్త వాదనని తెరపైకి తీసుకొస్తున్నాయ్. గవర్నర్ అనుమతిని తీసుకున్నారా ? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఆ విమర్శలని ప్రభుత్వం గట్టిగానే తిప్పికొడుతోంది. ఇప్పటికే ఆంధ్రా పెత్తనం కోరుకుంటున్నారా ? అంటూ మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. ఇక తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా నూతన సచివాలయ నిర్మాణం ఉంటుందని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు.