గుడ్ న్యూస్ : మహిళా పోలీసు బెటాలియన్ ఏర్పాటు

ఖాకీ డ్రెస్ వేసుకోవాలని ఆశపడుతున్న మహిళలకి గుడ్ న్యూస్. మహారాష్ట్రలో తొలిసారిగా మహిళా పోలీసు బెటాలియన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పదివేల మంది పోలీసులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని హోంమంత్రి అనిల్ వెల్లడించారు.మొత్తం 1,400 మంది మహిళలను నియమించనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణలో ఇప్పటికే షీ టీమ్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
