సల్మాన్ షూటింగ్’కు రెడీ

కరోనా ఎఫెక్ట్ తో సినీ షూటింగ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చినా.. దర్శక-నిర్మాతలు దైర్యం చేయడం లేదు. కరోనా ప్రభావం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆగస్టు నుంచి షూటింగ్స్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఆయన చిత్రం ‘రాధే: ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. అట్లూరి అగ్నిహోత్రి నిర్మాత. ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసినా.. లాక్‌డౌన్‌తో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే ఆగస్టు నుంచి చిత్రీకరణను పునః ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. దీని కోసం ముంబయిలోని మహబూబ్ స్టూడియోస్‌లోని ఓ ఫ్లోర్‌ను ఇప్పటికే బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తక్కువ మంది సిబ్బందితో షూటింగ్ నిర్వహించేలా ప్లాన్ చేసుకొంటున్నారు.
