కంగనా రాక.. ముంబై హీటెక్కింది !

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ముందే చెప్పినట్టు ఈరోజు ముంబై వస్తోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేష్ నుంచి బయలుదేరింది. ఈ సందర్భంగా ఆమె కరోనా టెస్టు చేయించుకున్నారు. నెగటివ్ వచ్చింది. దీంతో ఆమె ముంబై ప్రయాణించేందుకు లైన్ క్లియర్ అయింది. ఆమె మరికొద్ది గంటల్లో ముంబైలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ముంబై హీటెక్కింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో కంగనా బాలీవుడ్ లో బంధుప్రీతి, డ్రగ్స్ మాఫియాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పోల్చింది. బాలీవుడ్ కంటే ముంబై పోలీసులని చూస్తే భయమేస్తుందని కంగనా కామెంట్ చేసింది. అవి కాస్త కంగనా వర్సెస్ శివసేన గా టర్న్ తీసుకొన్నాయి.
ఈ నేపథ్యంలో శివసేన నేతల వార్నింగ్ నేపథ్యంలో.. వారిని సవాల్ చేస్తూ ఈరోజు కంగనా ముంబైలో అడుగుపెట్టబోతుంది. మరీ.. ఏం జరుగుతోంది? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కంగనాకి కేంద్రం ‘వై’ కేటగిరి భద్రతని కలిపించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేష్ ప్రభుత్వం విజ్ఝప్తితో కంగనాకి కేంద్రం భద్రతని కల్పించింది.
