24 గంటల్లో 89వేల కేసులు, 1115 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 89వేల కేసులు, 1115 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43లక్షల 70వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 33లక్షల 98వేల మంది కోలుకోగా మరో 8లక్షల 97వేల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

నిన్న ఒక్కరోజే 1115మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్‌-19తో మరణించిన వారి సంఖ్య 73,890కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం ఉండగా, మరణాల రేటు 1.7శాతం ఉంది. ఇక కరోనా కేసుల్లో భారత్ రెండో స్థానంలో, మరణాల్లో మూడో స్థానంలో ఉంది.