తెలంగాణ ‘కొత్త రెవెన్యూ చట్టం’లోని కీలక అంశాలు.. ఇవే !

తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆన్ లైన్ విధానానికి పెద్దపీఠ వేస్తూ.. కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపకల్పన చేశారు.
కొత్త రెవెన్యూ చట్టంలోని అంశాలు :
* రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు.
* గ్రామ రెవెన్యూ అధికారుల పదవులు రద్దు.
* ధరణి పోర్టల్లో ఆన్లైన్ ద్వారా భూ యాజమాన్య హక్కుల బదిలీ.
* పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూ రికార్డుల నిర్వహణ.
* వీఆర్వోగా పనిచేస్తున్న వారి సేవలను పరిపాలన అవసరాలను బట్టి అదే స్థాయిలో ఇతర ప్రభుత్వ శాఖలోకి బదిలీ.
* కొత్త చట్టం వ్యవసాయ యోగ్యమైన భూమి కోసం మాత్రమే వర్తిస్తుంది.
* పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రముగా పరిగణ.
* తహశీల్దార్ కు సబ్ రిజిస్ట్రార్ కు ఉండే అధికారాలు అప్పగింత.
* భూ వివాదాల పరిష్కారాల కోసం ఒక్కరు లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.
* కోర్ బ్యాంకింగ్ సిస్టం – ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయాలి.
* కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు… ఆ రికార్డులో పట్టాదారు పేర్లు – సర్వే నంబర్లు – విస్తీర్ణం ఉంటాయి.
* ఈ చట్టం కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు.
* పాయిగా – జాగీరు- సంస్థానాలు – మక్తా- గ్రామ అగ్రహారం – ఉహ్మ్లి- ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం
ప్రకారం బదిలీ చేయరాదు.
* జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి.
* ఏ రకమైన రిజిస్టేషన్ కోసమైనా ప్రభుత్వం నిర్దేశించిన వెబ్ సైట్స్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి.
* రిజిస్టేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తావేదులు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలి.
* మ్యుటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.
* వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే హక్కుల రికార్డు పూర్తి చేసి కొన్నవారికి వెంటనే
బదిలీ చేయాలి.
* ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి.
* మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు.
* జారీ చేసిన చేసిన తహశీల్దార్ పై బర్తరఫ్ క్రిమినల్ కేసులు – తిరిగి భూములు స్వాధీనం.
* కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం – ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వేయరాదు.
* ఇప్పటి వరకు ఎటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం తహశీల్దార్ కు
ఉంది.
* డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి.
* రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు.
* ఈ చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది.
* ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 రద్దు అవుతుంది.
* రికార్డులను అక్రమంగా దిద్దడం – మోసపూరిత ఉత్తర్వులు జారీ చేస్తే అధికారులు – ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు – సర్వీస్ నుంచి తొలగింపు బర్తరఫ్ చేస్తారు.
* 1971 యాక్ట్ రద్దు అయిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ – కేసులన్ని కొత్తగా ఏర్పాటు చేసే ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీ.
* విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఫైనల్.
* కొత్త చట్టం ఏర్పాటయిన తర్వాత రూల్స్ రూపొందించాలి.
Live: CM KCR introducing the New Revenue Bill in Telangana Legislative Assembly https://t.co/lYsOBX9NRu
— Telangana CMO (@TelanganaCMO) September 9, 2020
