నటి శ్రావణి ఆత్మహత్య కేసులో  కొత్త ట్విస్ట్.. తెరపై కొత్త వ్యక్తి పేరు !

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు దేవరాజు రెడ్డి (సన్నీ)నే కారణమని.. శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. టిక్ టాక్ ద్వారా దేవరాజు శ్రావణికి పరిచయం అయ్యాడు. దేవరాజు వేధింపులని తట్టుకోలేకనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

అయితే తాజాగా శ్రావణి ఆత్మహత్యపై దేవరాజు స్పందించారు. సాయి అనే వ్యక్తి వలనే శ్రావణి ఆత్మహత్య చేసుకొంది. సాయితో శ్రావణికి ఐదేళ్లుగా పరిచయం ఉందని దేవరాజు తెలిపారు. అంతేకాదు.. ఆత్మహత్య చేసుకొనే ముందు శ్రావణి తనకి చేసిన ఫోన్ కాల్ వీడియోని కూడా చూపించారు. అందులో సాయి వలనే తాను ఆత్మహత్య చేసుకుంటానని శ్రావణి చెప్పడం వినొచ్చు.

ఇంతకీ ఈ సాయి ఎవరు ? సాయితో శ్రావణి మాట్లాడం ఇష్టంలేని దేవరాజు ఆమెని వేధించేవాడా ? అన్నది దర్యాప్తులో తేలనుంది. మొత్తంగా శ్రావణి కేసులో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ తెరపైకి వచ్చేలా ఉంది. శ్రావణి కుటుంబ సభ్యులు మాత్రం దేవరాజుపైనే ఆరోపణలు చేస్తున్నారు. వారు సాయి గురించి మాట కూడా మాట్లాడటం లేదు. వారి సాయి గురించి తెలీయదా ? అన్నది తెలియాల్సి ఉంది.