TSలో 1,811 కేసులు, 2,072 మంది రికవరీ

కరోనా నుంచి క్రమ క్రమంగా తెలంగాణ కోలుకుంటున్నట్టు కనిపిస్తుంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించకున్నా.. రికవరీ అవుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. దీంతో..  కరోనా నుంచి తెలంగాణ నెమ్మదిగా కోలుకుంటుందని చెప్పుకొంటున్నారు.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,811 కొత్త కేసులు నమోదయ్యాయ్. అదే సమయంలో 2,072 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,83,025కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,346కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,217కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,104 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,551మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.