‘దిశ ఎన్ కౌంటర్’ ఆపేయండి.. హైకోర్టుని ఆశ్రయించిన దిశ తండ్రి !

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ పేరిట సినిమాని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దిశ అత్యాచారానికి గురైన నవంబర్ 26నే సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలని ఆపాలని దిశ తండ్రి శ్రీధర రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు.

మా కూతురు చనిపోయి మా కుటుంబాన్ని తీవ్ర దుఖంలో ముంచేసిందని, ఆ సంఘటనను మరువలేక పోతున్నామని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో దిశ ఎన్ కౌంటర్ పేరుతో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడని అన్నారు. అది కూడా తన కూతురు దూరం అయిన నవంబర్ 26నే సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడని అన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కింద చాలామంది అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.