ఢిల్లీలో తెరాస కార్యాలయం.. త్వరలోనే శంకుస్థాపన్ !

ఢిల్లీలోనూ తెరాస కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. పార్లమెంట్ ఉభయ సభల్లో కనీసం ఏడుగురు సభ్యులుండే పార్టీకి మాత్రమే కార్యాలయ నిర్మాణానికి దిల్లీలో స్థలం కేటాయిస్తారు. వసంత్ విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయించినట్లు కేంద్ర గృహనిర్మాణ శాఖ సమాచారం ఇచ్చింది. 550 చదరపు మీటర్ల చొప్పున రెండు బ్లాకులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించిన నేపథ్యంలో త్వరలోనే తెరాస అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
మరోవైపు తెలంగాణలోని ప్రతిజిల్లాలో తెరాస కార్యాలయాలని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అవి పూర్తికావొస్తున్నాయ్. ప్రతి జిల్లా కార్యాలయంలో సభలు, సమావేశాలు పెట్టుకునేట్టుగా కార్యాలయాలని విశాలంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే వీటిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక ప్రసుత్తం తెరాస దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
