బట్లర్‌ ని అవుట్ చేయడంపై అశ్విన్ కామెంట్ 

బడ్లర్-అశ్విన్ ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. బట్లర్‌ను మన్కడింగ్‌ ద్వారా అశ్విన్‌ ఔట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరు ఎప్పుడు ఎదురుపడిన ఉత్కంఠని రేపుతుంది. శుక్రవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ బట్లర్ ని అశ్విన్ అవుట్ చేశారు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2వికెట్లు తీసిన అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ మాట్లాడాడు. ‘బట్లర్‌ వికెట్‌ను ఎంతో ఆస్వాదించాను. ఒక మంచి క్యాచ్‌ కూడా అందుకున్నాను. పవర్‌ప్లేలో క్యారమ్‌బాల్‌ ఒకటీ.. రెండు సార్లు వేశాను. అయితే, బంతిపై తేమ ఉండి స్పిన్‌కు అంతగా అనుకూలించలేదు’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

ఇక తాజా ఐపీఎల్ లో ఆడిన ఆరు మ్యాచుల్లో అయిదో విజయం ఖాతాలో వేసుకుంది ఢిల్లీ జట్టు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ప్లేఆఫ్స్‌ మార్గాన్ని సుగమం చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన దిల్లీకి నిర్ణీత 20 ఓవర్లలో 185/8 పరుగులు చేసింది.  ఛేదనకు దిగిన రాజస్థాన్   19.4 ఓవర్లకు 138కే కుప్పకూల్చింది.