గోవాలో బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన నిహారిక


మెగా హీరోయిన్ నిహారిక త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యని పెళ్లాడనుంది. ఇప్పటికే వీరి నిశ్చార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి జరగనుంది. ఈ గ్యాప్ లో నిహారిక, చైతన్య ఇద్దరూ.. ఫిట్నెస్ పై పోకస్ పెట్టారు. ఎక్కువ సమయం జిమ్ లో గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
 
ఇక తాజాగా నిహారిక స్నేహితులతొ కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ బ్యాచిలర్ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది నిహారిక. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక.. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలు చేసింది. హీరోయిన్ గా బిజీ కాకముందే పెళ్లి చేసుకొని.. రెండో ఇన్నింగ్స్ మొదలెట్టబోతుంది.