టాలీవుడ్’లో మరో విషాదం.. అసిస్టెంట్ డైరెక్టర్ మృతి !

టాలీవుడ్ మరో విషాదం నెలకొంది. షూటింగ్ స్పాట్ లో గాయపడిన అసిస్టెంట్ డైరక్టర్ ప్రవీణ్ మృతి చెందారు. ఇతను డైరక్టర్ సుధీర్ వర్మ శిష్యుడు. రణరంగం తదితర సినిమాలకు సుధీర్ వర్మ దగ్గర పని చేసారు. ఇటీవలే దర్శకుడిగా ఛాన్స్ కూడా కొట్టేశారు. ఆహా ఓటిటిలో ఒక సినిమాకు డైరక్షన్ చాన్స్ వచ్చింది. దాదాపు పూర్తి చేశారు.

చివరగా షూటింగ్ జరుగుతుండగా కారు నడపాల్సిన సీన్ ఒకటి వచ్చింది. ఆ సీన్ ని చూపించేందుకు స్వయంగా కారు నడిపారు. ఆ సమయంలో కారు ప్రమాదానికి గురై ప్రవీణ్ కి తీవ్ర గాయాలయ్యాయి. వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి ఆఖరికి ఓడిపోయారు. దర్శకుడిగా తొలి అవకాశం వచ్చి.. ఆ ఆనందంలో ఉండగానే ప్రవీణ్ మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది.