అఖిల్-మోనాల్ ప్రేమకు నో చెప్పిన పెద్దలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారంతో ఐదు వారాలని పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లో ప్రేమ జంటలు ఏర్పడ్డాయ్. అఖిల్-మోనాల్, అభిజిత్-నిహారికలు క్లోజ్ గా ఉంటున్నారు. కొన్నాళ్లు మోనాల్ ఇటు అఖిల్, అటు అభిజిత్ తోనూ రొమాన్స్ చేసినా.. ఆ తర్వాత అఖిల్ కే ఫిక్సయినట్టు అనిపిస్తోంది.
మరోవైపు అవినాష్ ని గోకే ప్రయత్నం చేస్తోంది హరియాణ. ఆయన మాత్రం తనకు బయటపెళ్లి సంబంధాలు చూస్తున్నారని తప్పించుకు తిరిగుతున్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో అఖిల్-మోనాల్ లవ్ స్టోరీనే ఆసక్తిని కలిగిస్తోంది. అయితే మోనాల్ తో అఖిల్ ప్రేమని ఒప్పుకోమని.. ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో అఖిల్ తల్లి మాట్లాడారు.
మోనాల్ తో తమ కుమారుడు క్లోజ్ గా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి అఖిల్ రాగానే… ఒక అందమైన తెలంగాణ అమ్మాయితో పెళ్లి చేసేస్తామని అఖిల్ తల్లి చెప్పారు. ఇప్పటికే అఖిల్ కు సంబంధాలు చూస్తున్నామని వెల్లడించారు. దీంతో, మోనాల్ ని అఖిల్ మనస్పూర్తిగా ఇష్టపడినా… వారి పెళ్లి చేసేందుకు అఖిల్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చనే విషయం అర్థమవుతోంది.
