ఏపీ కరోనా రిపోర్ట్ : 5,653 కేసులు, 6,659 రికవరీ 

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ కొత్త కేసులు భారీగానే నమోదవుతున్నాయ్. అయితే అంతకుమించి కరోనా నుంచి కోలుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 5,653 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,50,517కు చేరింది.

ఇక నిన్న ఒక్కరోజే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6,194 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 6,659 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. మొత్తంగా 6,97,699 మంది కోలుకొని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం 46,624 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.