ఓటీటీలో అశ్లీలతపై కేంద్రం చర్యలు

కరోనా లాక్‌డౌన్ తో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఇటీవల కాలంలో ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఓటీటీలో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ కనిపిస్తోంది. దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయ్. ఈ నేపథ్యంలో ఓటీటీలో పెరిగిపోతున్న అశ్లీలత కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది.
ఇకపై ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా ఉండనుంది. కొత్తగా ఆన్‌లైన్ ఛానల్స్ ప్రారంభించాలంటే అనుమతి తప్పనిసరని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ కంటెంట్‌లను సమాచార శాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓటీటీ కంటెంట్ కూడా సెన్సార్ కచ్చితంగా ఉండాలన్న డిమాండ్లు వస్తుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓటీటీ కంటెంట్‌పై నిఘాతో అశ్లీలతను కంట్రోల్ చేయనున్నారు.
