నేటి నుంచి మేడారంలో భక్తులకి అనుమతి

కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదల్లేదు. కరోనా ఎఫెక్ట్ తో దేశంలోనే దేవాలయాలన్నీ కొన్నాళ్లపాటు మూటపడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ వన దేవతల దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ రోజు నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సమ్మక్క, సారలమ్మలకు పూజారులు మొక్కులు చెల్లించారు. నేటి నుంచి భక్తులు కూడా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించవచ్చని పూజారుల తెలిపారు. ప్రపంచలోనే అతిపెద్ద గిరిజిన జాతరగా మేడారంకు పేరుంది.
