సుమకు కరోనా టెస్ట్.. నవ్వులే నవ్వులు !

యాంకర్ సుమ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. చక్కగా మాట్లాడుటూ.. చకచకా పంచులేస్తుంటుంది. ఇటీవల ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 షోలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ షోకి హాజరుకావడానికి ముందు ఆమె కరోనా టెస్టు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
“నేను బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు.. కానీ వెళ్లకముందు ఏం జరిగిందో మీరే చూడండి” అంటూ ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో కోవిడ్ టెస్ట్ చేయించుకుంటూ ఆమె చేసిన కామెడీకి పగలబడి నవ్వక తప్పదు. రిజల్ట్ ఎంత సేపు పడుతుంది ? అంటే.. 10 నిమిషాలు పడుతుందంటే అప్పుడు ఓస్ అంతేనా అంటూ నవ్వించింది. నోట్లో పెట్టారు. కొంచం యాంకరింగ్ తీసుకున్నారని సటైర్ వేసింది.
And you’ll know what happened after I went to @bb so now see what happened before… pic.twitter.com/iCbcY1p2CQ
— Suma Kanakala (@ItsSumaKanakala) November 9, 2020
