నటిగా బాధ్యత పెరిగింది

నటిగా మరింత బాధ్యత పెరిగింది అంటోంది బాలీవుడ్ హీరోయిన్ కైరా అడ్వానీ. ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో మంచి పేరు వచ్చినా.. అది టాలీవుడ్ వలన. మహేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది కైరా. ఇక టాలీవుడ్ సంచలనం అర్జున్ రెడ్ది హిందీ రిమేక్ ‘కబీర్ సింగ్’లో నటించింది.
కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. బాలీవుడ్ లో కైరా ఇమేజ్ అమాంతం పెరిగింది. ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయ్. ఈ నేపథ్యంలో ‘కబీర్‌సింగ్’ చిత్రం తనకు తిరుగులేని స్టార్‌డమ్‌ను అందించిందని..ఆ సినిమా విజయంతో నటిగా మరింత బాధ్యత పెరిగిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది కైరా. ఇక ఆమె నటించిన ‘లక్ష్మీ’ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయింది. మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది కూడా తెలుగు రిమేక్ నే. కాంచనకి రిమేక్.
