భాజాపా పిలుస్తోంది అంటోన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు !

తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజాపా మారబోతుందని నిన్నటి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భాజాపా పిలుస్తోంది అంటూ అప్పుడే స్లోగన్ అందుకున్నారు. కాంగ్రెస్ లో ఉండలేక.. తెరాసలో చోటు లేక ఉన్న నేతలంతా ఇప్పుడు కమలం వైపు చూస్తున్నారు. వారిని చేర్చుకోవడానికి భాజాపా రెడీగా ఉంది.

అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి భాజాపాలో చేరబోతుంది. ఆమెతో పాటు భారీగా కాంగ్రెస్ నేతలు కమలం కండవ కప్పుకున్నారు. ఇదీగాక.. రాబోయే గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు కమలం పార్టీలోకి క్యూ కట్టే అవకాశాలున్నాయ్. ఒక్క కాంగ్రెస్ నుంచి మాత్రమే కాదు. అధికార తెరాస నుంచి భాజాపాలోకి వలసలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో భాజాపా మూమెంట్ మొదలైందని చెప్పుకొంటున్నారు. మరీ.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ అంటే.. ? తెదేపా లాగా కాంగ్రెస్ కానుందంటున్నారు.