కరోనాతో బాలీవుడ్ నటుడు మృతి

కరోనా బాలీవుడ్ నటుడు హరీష్ బన్చాటా కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన హరీష్ దానిపై పోరాటంలో ఓడిపోయారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 48 ఏళ్ల హరీష్ పలు బాలీవుడ్ చిత్రాలలో నటించారు.18 ఏళ్లుగా బాలీవుడ్లో నటునిగా కొనసాగుతున్నారు. భజరంగీ భాయీజాన్ సినిమాలో హరీష్… పోలీసు అధికారి పాత్రలో నటించారు.
సినిమాలు మాత్రమే కాదు.. పలు టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు. హరీష్ మృతిపట్ల బాలీవుడ్ స్టార్ హీరోలు సంతాపం తెలిపారు. అజయ్ దేవగణ్ హరీష్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడే మోశారు. మరో విషాదం ఏంటంటే ? హరీష్ కన్నుమూసిన ముందురోజే అతని కూడా తల్లి మృతి చెందారు.
