పోలీసుల వైఫల్యంపై సీఎం సీరియస్..!

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముందు నుంచి మేడారం జాతరపై ప్రత్యేక దృష్టిని పెట్టిన ప్రభుత్వం ప్రచారం కూడా ఆస్థాయిలోనే చేసింది. శుక్రవారం మేడారంలో కుటుంంబంతో సహా అమ్మవార్లను దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం ఏర్పాట్లు, పోలీసుల పనితీరుపై ఆరా తీశారు.
మేడారం జాతరలో పోలీసుల వైఫల్యంపై సిఎం కెసిఆర్ సీరియస్ అయ్యారు. జాతరలో ట్రాఫిక్ జాం, మీడియాపై పోలీసుల ఓవర్ యాక్షన్, గద్దెల వద్ద పోలీసు కుటుంబాల తాకిడిపై సీఎం ఆరా తీశారట. జాతరను సక్రమంగా నిర్వహించడంలో పోలీసుల వైఫల్యం చెందారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
