తెలంగాణ వ్యాప్తంగా టీ20 లీగ్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్న‌ల్..!

శనివారం నుంచి హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో వెంకటస్వామీ మెమోరియల్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఈ పోటీల‌ను కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్ , హీరో వెంకటేష్ ముఖ్య అతిధులుగా హాజ‌రై ప్రారంభిస్తారు. రంగారెడ్డి రైజర్స్ – మెదక్ మేవరిక్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మెదట మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఉప్పల్ , జింఖానా గ్రౌండ్స్ తో పాటు.. సిద్దిపేట MLR గ్రౌండ్, AOC గ్రౌండ్స్ మ్యాచ్ లకు ఆతిధ్యమివ్వ‌నున్నాయి. ఈ టోర్నికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించటమే ఈ టోర్ని లక్ష్యంగా చెబుతున్నారు నిర్వాహ‌కులు . ఈ పోటీల్లో తెలంగాణ పాత పది జిల్లాల నుంచి పది జట్లు పాల్గొంటున్నాయి. హైద్రాబాద్ టాప్ ప్లేయర్స్.. ఒక్కో జట్టుకు ఒక్కరు ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఫిబ్రవరి 25న ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. విజేతల‌కు 15 లక్షలు మెదటి బ‌హుమ‌తి, రన్నరప్ కు 7.5 లక్షలు, రెండో రన్నరప్ కు 4 లక్షలు, మూడో రన్నరప్ కు 2 లక్షలుగా బ‌హుమ‌తులు నిర్ణ‌యించారు. హైద్రబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీఐ గైడ్ లైన్స్ ప్రకారం టోర్నిని నిర్వహిస్తామ‌ని, బీసీసీఐ యాంటీ కరప్షన్ కోడ్ ను ఫాలో అవుతామ‌ని హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారు.