నటి చిత్ర ఆత్మహత్య వెనక షాకింగ్ నిజాలు

తమిళ టీవీ నటి చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ హోటల్ గదిలో ఆమె బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె సుసైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. అందులో ఒకట్రెండు చోట్ల రక్తం మరకలు, గొడవపడిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో చిత్ర ఆత్మహత్యపై నెటిజన్స్ లో అనుమానాలు కలిగాయి.
ఈ క్రమంలోనే చిత్ర తల్లి కూడా మృతిపట్ల తనకున్న అనుమానాలను బహిర్గతం చేశారు. తన అల్లుడు హేమంతే(చిత్ర భర్త) చిత్రను కొట్టి చంపేసి ఉంటాడని ఆమె అన్నారు. అందుకే, చిత్ర మృతదేహంపై చెంపదెబ్బల ఆనవాళ్లు ఉన్నాయని ఆమె తెలిపారు.
ఇక చిత్ర-హేమంత్ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కొన్నినెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి గురించి అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాక ఈ ఏడాదిలో పెద్దలందరి సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొన్నారు. అయితే అఫిషియల్ గా పెళ్లికి ముందే చిత్ర ఆత్మహత్యకు పాల్పడం విషాదాన్ని మిగిల్చింది.
