జగ్గారెడ్డి సడెన్ షాక్

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సడెన్ షాక్ ఇచ్చారు. ఆయన హఠాత్తుగా పాదయాత్ర ప్రకటించారు. సంగారెడ్డి నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేస్తా. ప్రతి రైతుని కలుస్తా. సమస్యని తెలుసుకుంటా. వాటిని అసెంబ్లీలో ప్రకటిస్తానని చెప్పాడు. అయితే కాంగ్రెస్ అధిష్టానం కొత్త పీసీసీ చీఫ్ కోసం కసరత్తు చేస్తున్న టైమ్ లోనే జగ్గారెడ్డి జగ్గారెడ్డి పాదయాత్ర ప్రకటించడం విశేషం.
మరోవైపు పీసీసీ పోస్ట్ పై తెలంగాణ కాంగ్రెస్ లో ఎవ్వరికి వారే నమ్మకంతో ఉన్నారు. పీసీసీ పోస్ట్ తనదేనని ఎంపీ కోమట్ రెడ్డి ఒకటికి రెండుసార్లు బహిరంగ ప్రకటన చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనకి అవకాశం ఇవ్వాలని కోరారు. శ్రీధర్ రెడ్డి, భట్టీ తదితరులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పీసీసీ పీఠానికి మొదటి పోటిదారుడిగా రేవంత్ రెడ్డి ఉండనే ఉన్నారు. ఇద్దరిని కాదని పీసీసీ పోస్ట్ తనకే దక్కుతుందని జగ్గారెడ్డి నమ్మకంతో ఉన్నట్టున్నాడు. అందుకే ఆయన పాదయాత్ర ప్రకటన చేశారని చెప్పుకుంటున్నారు.
