వెంకన్నకి పవన్ ప్రత్యేక పూజలు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యామిలీ టైమ్ అయిపోయింది. వెంటనే ఆయన పాలిటిక్స్ లోకి దిగిపోయారు. కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ సమీపంలోని డోకిపర్రి గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఇటీవల కృష్ణాజిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులకు ఎకరాకు రూ.35వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలంటూ ఒకరోజు దీక్ష చేపట్టారు. అనంతరం ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన తన అన్న నాగబాబు కుమార్తె నిహారిక వివాహానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం పవన్ కృష్ణాజిల్లాకు విచ్చేశారు. పవన్  కృష్ణా జిల్లా పర్యటన కొనసాగనుంది.

మరోవైపు తిరుపతి ఉప ఎన్నికలో పోటీపై జనసేన-భాజాపాల మధ్య ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. ఇందుకు ఇరు పార్టీలు ఓ కమిటీని నియమించాయి. వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నిక స్థానాన్ని జనసేనకి కేటాయించబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన చేసిన త్యాగానికి ఇది ప్రతిఫలం అనే చెబుతున్నారు. అయితే సమావేశాలు, చర్చల అనంతరమే తిరుపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకొనేలా ఉన్నారు.