అన్నవరంలో కొత్త జంట పూజలు

కొత్తజంట చైతన్య-నిహారిక తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలో పాల్గొన్న వీరికి పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు. నిహారిక అత్తమామలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ నెల 9న చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోగల ఉదయ్‌ విలాస్‌లో వివాహ వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. డిసెంబరు 11న హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. పెళ్లి పనులన్నీ ముగిసిన నేపథ్యంలో కొత్త జంట అన్నవరం వచ్చి పూజలు చేశారు.