మిల్కీ బ్యూటీకి కూడా బ్రేకప్ స్టోరీ ఉందట !

టాలీవుడ్ లో పెద్దగా పుకార్లు రానీ హీరోయిన్ ఎవరు ? అనగానే టక్కున మిల్కీ బ్యూటీ తమన్నా పేరు చెబుతుంటారు. నిజమే.. తమన్నా ఫలనా హీరోతో ఎఫైర్ నడిపిస్తుంది ? అనే వార్తలు రాలేదనే చెప్పాలి. అలాంటి తమన్నాకు కూడా బ్రేకప్ స్టోరీ ఉందట. ఈ విషయాన్ని స్వయంగా తమ్మూనే చెప్పింది.

సమంత హోస్ట్ గా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ చాట్‌ షో ‘సామ్‌ జామ్‌’ లో తమన్నా పాల్గొంది. పర్సనల్, సినిమాకు సంబంధించిన విషయాలని పంచుకుంది. తమన్నా కాఫీ ప్రియురాలు, అప్పుడప్పుడు కవి, నటి అని ఉంది. మీరు కవితలు కూడా రాస్తారా? ఇప్పటివరకూ నాకు తెలియలేదు?’ అని సామ్‌ ప్రశ్నించింది.

“ఎప్పుడైతే మన హృదయం ముక్కలవుతుందో అప్పుడు మనం కవిత్వాలు రాస్తాం’ ఈ విషయం నీక్కూడా తెలుసు. మన జీవితంలో అలాంటిది ఏమైనా జరిగినప్పుడు మనం కవిగా¥ మారుతుంటాం. ఈ సమాజంలో ఎదుటివారి హృదయాలను ముక్కలు చేసే మనుషులు ఉన్నారు” అని తమన్నా సమాధానం చెప్పింది. దీంతో సామ్‌.. ‘తమన్నా హార్ట్‌ని బ్రేక్‌ చేసే ధైర్యం ఎవరికి ఉంది? ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి.’ అంటూ సరదాగా కామెంట్ చేసింది.