వైరల్ : ఒకే వేదికపై తల్లి, కూతుళ్ల పెళ్లిళ్లు

యూపీలో ఒకే వేదికపై తల్లి, కూతుళ్లు పెళ్లి చేసుకోవడం ఆకట్టుకుంది. గోరఖ్ పూర్ లోని పిప్రోలీ ప్రాంతంలో ఇటీవల సామూహిక వివాహాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన కింద ఈ పెళ్లిళ్ల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇందు (27) రాహుల్ (29)ని పెళ్లాడింది. ఇక ఇదే కార్యక్రమంలో ఇందు తల్లి బేలిదేవి (53) సొంత మరిది జగదీష్ (55)ని పెళ్లాడింది.
బేలిదేవి భర్త హరిహర్ పాతికేళ్ల కిందట చనిపోయాడు. ఈ క్రమంలో ఆమె తన చిన్నమరిది జగదీశ్ (55)తో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. జగదీశ్ ఇప్పటివరకు అవివాహితుడిగానే ఉన్నాడు. తన పెళ్లి విషయం చెప్పగానే పిల్లలిద్దరు సంతోషించారని.. అందుకే హ్యాపీగా పెళ్లి చేసుకున్నానని బేలి దేవి తెలిపారు.
