బిగ్ సప్రైజ్ : శాకుంతలగా సమంత

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ లవ్‌స్టోరీ ‘శాకుంతలం’. ఇందులో సమంత టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు శుక్రవారం చిత్ర బృందం ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా ‘శాకుంతలం’ టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సమంత పేరు అధికారికంగా ప్రకటించారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
మహాభారతం ఆదిపర్వంలోని విశ్వామిత్రుడు, మేనకల కుమార్తె శాకుంతల, దుష్యంతుల ప్రేమకథను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా ‘శాకుంతలం’ తెరకెక్కుతోంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. జాను తర్వాత సామ్ మరో సినిమా చేయలేదు. తొలిసారి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్ 2లో నటిస్తోంది. ఆహా కోసం సామ్ జామ్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
