ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. ఎక్కడో తెలుసా ?

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పండగలు, పబ్బాలకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆఖరికి ఆఖరి చూపుకి దూరంగా ఉండటమే బెటర్. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరవ్వడం కూడా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. ఇవేవి పట్టించుకోని ఓ కుటుంబంలో ఏకంగా 22 మందికి కరోనా సోకింది. తెలంగాణలోని సూర్యాపేటలో ఇది జరిగింది.

ఇటీవల అంత్యక్రియలకు హాజరైన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా ఆయన కుటుంబసభ్యులకూ కరోనా సోకింది. అయితే ఎవరికీ పెద్దగా లక్షణాలు కనిపించలేవట. ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా సోకడంతో గతంలో వారంతా ఎవరెవరిని కలిశారు అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.