‘పాగల్’గాడి ఫస్ట్ లుక్ చూశారా ?


ఫలక్‌నామా దాస్, హిట్ సినిమాలతో విశ్వక్ సేన్ సూపర్ హిట్ అయిపోయాడు. ఆయన తాజా చిత్రం ‘పాగల్’. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు నరేష్ కుప్పలి దర్శకత్వం వహిస్తున్నారు. రధాన్ సంగీతం అందిస్తున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ‘పాగల్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఇందులో విశ్వక్ సేన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తర్వాత బోల్డ్ గా కనిపించే.. నటించే నటుడిగా విశ్వక్ సేన్ పేరుతెచ్చుకున్నారు. మంచి కథ పడితే.. ప్రేక్షకులకి పిచ్చేక్కించేలా ఉన్నాడు. పాగల్ అలాంటి కథే అని చెబుతున్నారు. ఏప్రిల్ 30న పాగల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.