వాలంటైన్స్ డే ఆఫర్ : తాజ్’లో ఉచిత బస.. ఇదీ నిజం !


ఫిబ్రవరి 14 – వాలంటైన్స్ డే దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్, హోటల్స్.. ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో హోటల్ తాజ్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 14న ఆ హోటల్ లో ఉచితంగా బస చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు అనే ప్రకటన ఒకటి వైరల్ అయింది. తాజ్ హోటల్‌లో ఉచితంగా బస చేయడానికి కూపన్ అందిస్తున్నట్లు వెబ్‌సైట్‌లో తెలిపారు. అయితే ఇది ఫేక్ ప్రకటన. సైబర్ నేరగాళ్ల వల.

తాజాగా ఈ ప్రచారంపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందించింది. దీనిపై తాజ్ యాజమాన్యం వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తాజ్‌ హోటల్‌లో వాలంటైన్స్ డే ఆఫర్ పేరుతో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానితో తాజ్ హోటల్స్ గానీ, హెచ్ఐసీఎల్ గానీ సంబంధం లేదని స్పష్టం చేసింది. తాము ఎటువంటి వాలంటైన్స్ డే ప్రకటనలు ఇవ్వలేదని తెలిపింది. దీనిని ప్రజలు గమనించాలని కోరింది. తాజ్ పేరుతో వచ్చే ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తాజ్ అభ్యర్థించింది.