కొత్త రూల్ : డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. క్యారెక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. డ్రైవింగ్ వస్తే సరిపోదు. క్యారెక్టర్ కూడా ఉండాలి. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే క్యారెక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందే. ఈ మేరకు మధ్యప్రదేష్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. మహిళలపై దాడులు చేసే వారికి.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం ఈ కొత్త రూల్ ప్రధాన ఉద్దేశం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాఫియాలను, మహిళలపై నేరాలకు పాల్పడే వ్యక్తులను విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా కమిషనర్ ఎంకే జైన్ తెలిపారు. ఈ ఉత్తర్వు ప్రకారం.. “పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు శిక్షణ మరియు పరిశోధనా సంస్థ (పిటిఆర్ఐ) నుంచి వచ్చిన సూచనల ప్రకారం, ప్రాంతీయ మరియు జిల్లా రవాణా అధికారులందరికీ పోలీసు శాఖ నుండి సమాచారం వచ్చిన తరువాత మహిళలపై నేరాలకు పాల్పడిన నిందితుల లైసెన్సులను నిలిపివేయాలని నిర్ణయించారు.” అదేవిధంగా, దరఖాస్తుదారుడు ఒక పోలీసు అధికారి ధృవీకరించిన క్యారెక్టర్ సర్టిఫికేట్ని కచ్చితంగా సమర్పించవలసి ఉంటుంది.
