బాలయ్య క్రాక్.. ఫిక్స్ !

నటసింహం నందమూరి బాలయ్య ఓ క్రాక్. ఆయనకి కోపం వస్తే ఆపుకోలేరు. బాలయ్య చాలా సార్లు అభిమానులు, పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకోవడం… దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాం. అయితే ఇప్పుడు బాలయ్య నిజంగానే క్రాక్ దర్శకుడు చేతిలో పడ్డారు. గోపీచంద్ మలినేని-రవితేజ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనికి ఆఫర్లు క్యూకడుతున్నాయి.

ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నుంచే పిలుపొచ్చింది. చిరు లేదా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గోపీచంద్ తదుపరి సినిమా ఉండనుందనే ప్రచారం జరిగింది. అయితే గోపీచంద్ మాత్రం బాలయ్య కోరుకున్నాడు. ఓ పవర్ ఫుల్ కథతో బాలయ్యని ఒప్పించారు.  తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ ఏడాది మే నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. దీనికి సంబంధించి మైత్రీ మూవీ మేక‌ర్స్ టీం త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో వీరి కాంబోలో వచ్చిన లెజెండ్, సింహా సినిమాలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో బిబి3 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బాలయ్య సినిమాని ఓ రేంజ్ లో ఉండేలా బోయపాటి తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా రాబోతుంది.