‘మత్తు ఎమ్మెల్యే’లని కేసీఆర్ కాపాడుతాడా ?

టాలీవుడ్ లో తంలోనే డ్రగ్స్ కలకలం రేగింది. సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులో ప్రమేయం వున్నట్లు నానా హడావుడి జరిగింది. విచారణలు జరిగాయి. కానీ అరెస్టులు, శిక్షలు వంటివి ఏమీ జరగలేదు. ఆ కేసుల అలా.. తొక్కిపెట్టేశారు. సీఎం కేసీఆర్ దయ వలనే.. డ్రగ్స్ కేసు నుంచి టాలీవుడ్ ప్రముఖులు తప్పించుకొన్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. 

అయితే మరోసారి తెలంగాణలో డ్రగ్స్ కలకలం రేగేలా కనిపిస్తోంది. అయితే ఈసారి టాలీవుడ్ నుంచి కాదు.. ఇటీవల కర్ణాటకలో సంచలన కలిగించిన డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రమేయం వుందన్న వార్తలు వినిపిస్తున్నాయ్. ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలకు డ్రగ్స్ సప్లయి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరింతా యంగ్ ఎమ్మెల్యేలు అనే టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో సినీ ప్రముఖులని డ్రగ్స్ కేసు నుంచి సీఎం కేసీఆర్ కాపాడగలిగారు. ఈ సారి సొంతం పార్టీ నేతలని కాపాడుకోలేరా ? అనే చర్చ నడుతోంది. అయితే ఈ సారి కేసు మన రాష్ట్ర పరిధిలో లేదు. కర్ణాటకలో తోడితే.. ఇక్కడి ఎలుకలు పడ్డాయ్. అక్కడ ఉంది భాజాపా ప్రభుత్వం.. దీంతో కేంద్రం స్థాయిలో తెరాస ప్రయత్నాలు చేస్తే.. ఏమైనా ఫలితం ఉండవచ్చెమో.. !